బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి సోదరి సనా కపూర్ కొత్త పెళ్లికూతురిగా ముస్తాబైంది. నటుడు మనోజ్- సీమ దంపతుల కుమారుడు మయాంక్‌తో శుక్రవారం ఏడడుగులు నడిచింది. ఈ సందర్భంగా కొత్త జంట సనా- మయాంక్‌ల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో మెహందీ ఫొటోల్లో సనా ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది.
సంగీత్‌లో డ్యాన్సులు చేస్తూ పెళ్లి సందడిని రెట్టింపు చేసింది కపూర్ ఫ్యామిలీ. షాహిద్- మీరా రాజ్‌పుత్‌ల హడావుడి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సుప్రియ పాఠక్, పంకజ్ కపూర్ల గారాల కూతురు సనా గతంలో షాందార్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన సోదరుడు షాహిద్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించారు.