విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తోన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ఫిబ్రవరి 25న షాహిద్ పుట్టిన రోజు సందర్భంగా బీటౌన్ తారల నుంచి శుభాకాంక్షల జల్లులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ ప్రేమతో కూడిన విషెస్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసింది. మీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇలాంటి సాయింత్రాలు మనిద్దరం కలిసి మరెన్నో జరుపుకోవాలి’ అని క్యాప్షన్ రాస్తూ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేసింది.
ఈ ఫొటోలలో షాహిద్ తెల్లటి టీషర్ట్, డెనిమ్ టాప్ వేసుకోగా, మీరా ఫ్లోరల్ ప్రింట్‌తో బ్లాక్ ఆఫ్ షోల్డర్ దుస్తులను ధరించింది. మీరా అందంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటే షాహిద్ ఆమెను ప్రేమగా చూస్తున్నాడు. అలాగే సూర్యుడు అస్తమిస్తుండగా దిగిన మరో ఫొటోను పంచుకుంది మీరా. షాహిద్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను తన ఇంట్లో నిరాడంబరంగా జరుపుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్‌కు ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వానీ హాజరైనట్లు సమాచారం.