సమంతా అంటే ఆ బాలీవుడ్ హీరోకి ఇష్టం

సమంతా అంటే ఆ బాలీవుడ్ హీరోకి ఇష్టం

బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ కథల మీద ఎక్కువగా మోజు చూపుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఎక్కువగా తెలుగు కథలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. అందులో కుర్ర హీరోలు, కుర్ర దర్శకులు చేసిన చిత్రాలే ఎక్కువగా బాలీవుడ్ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్‌గా తీసి, షాహిద్ కపూర్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక మరో తెలుగు రీమేక్‌తో అందరినీ మెప్పించేందుకు తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు.

నాని గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన జెర్సీ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో షాహిద్ రీమేక్ చేస్తున్నాడు. దానికి కూడా గౌతమ్ తిన్ననూరే దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రానికి మోక్షం లభించింది. మహారాష్ట్ర సర్కారు అక్టోబర్ 22 నుంచి థియేటర్ల తెరుస్తామని ప్రకటించడంతో.. బాలీవుడ్ చిత్రాలు వరుసగా లైన్లోకి వచ్చాయి.అందులో భాగంగా జెర్సీని డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.

ఈ క్రమంలో షాహిద్ కపూర్ తన సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా ట్విట్టర్‌లో లైవ్ చాట్ చేశాడు. అందులో ఓ నెటిజన్.. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత నటన గురించి చెప్పండి అన అడిగాడు. దీంతో సమంత మీద షాహిద్ ఊహించని కామెంట్ చేశాడు. అందులో ఆమె అద్భుతంగా నటించింది.. ఎప్పుడైనా ఆమెతో ఓ సారి కలిసి నటించాలని ఉంది అంటూ తన కోరికను షాహిద్ బయటపెట్టేశాడు. మొత్తానికి సమంత మీద బాలీవుడ్ స్టార్ హీరోల కన్ను పడ్డట్టు కనిపిస్తోంది.