‘శంభోశంకర’కు త్రివిక్రమ్‌కు సంబంధం ఏంటీ?

Shakalaka Shankar Brings Shambo Shiva Shambo movie pre-release event

కమెడియన్‌ షకలక శంకర్‌ జబర్దస్త్‌ ద్వారా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. పలు చిత్రాల్లో ఈయన కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా ఒక చిత్రం తెరకెక్కింది. ‘శంభోశంకర’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తెరకెక్కుతున్న సమయంలో ఏ ఒక్కరు పట్టించుకోలేదు. అయితే టీజర్‌ మరియు ఫస్ట్‌లుక్‌ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా కేవలం రెండు కోట్లతో తెరకెక్కగా ఏకంగా 5.5 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంపై అంచనాలతో అంతా కూడా ఎంతో ఆసక్తిగా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో హీరో షకలక శంకర్‌ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.

దర్శకుడు ఈ కథను షకలక శంకర్‌కు చెప్పిన సమయంలో వెంటనే ఆ కథతో దర్శకుడు త్రివిక్రమ్‌ వద్దకు వెళ్లాను. ఆయనతో పెద్దగా నాకు పరిచయం లేదు. ఆయన చేసిన ఒక చిత్రంలో అది కూడా ఒక్క రోజు నటించాను. ఆ సన్నిహిత్యంతోనే తన సినిమాను నిర్మించాల్సిందిగా వెళ్లాను. తన కథపై నమ్మకం ఉంచి రెండు కోట్లు బడ్జెట్‌తో సినిమా నిర్మించాల్సిందిగా కోరాం. అయితే సినిమాకు ఆయన బడ్జెట్‌ను పెట్టేందుకు ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్న కారణంగా నిర్మాణంపై ఆసక్తి చూపించలేను అంటూ దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పడంతో నిరాశగా అక్కడ నుండి వెనుదిరిగారు. అయితే కథ విన్న త్రివిక్రమ్‌ మాత్రం చాలా బాగుందని, తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు అంటూ శంకర్‌ ఆనందంగా చెప్పుకొచ్చాడు.