దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ నుంచి ప్రేరణ పొందిన ఈ రియాలిటీ షో ప్రారంభించిన అన్ని భాషల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందింది. కాగా హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ 15వ సీజన్ నడుస్తోంది. ప్రతి సీజన్లోనూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్‌లోకి తీసుకురావడం పరిపాటిగా మారింది.కాగా, తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్, శిల్పా సోదరి షమితా శెట్టి తల్లి షోలోకి ప్రవేశించింది.
ఎంతో ధైర్యంగా మాట్లాడి, కూతురిని ప్రోత్సహించింది. ఆ సమయంలో షమితా శిల్పా ఎలా ఉందని అడగగా.. ‘ఆమె బావుంది. నిన్ను ఎంతో మిస్ అవుతోంది. ఎంత బిజీగా ఉన్న నీ గురించి ఎప్పటికప్పుడూ అడిగి తెలుసుకుంటోంది. మన ఇంట్లోని మహిళమైన శిల్పా, నువ్వు, నేను ఎంతో ధైర్యవంతులం. కాబట్టి ఏమి ఆలోచించకుండా సంతోషంగా ఉండు.
నీ ఆట నువ్వు ఆడు’ అంటూ సునంద కూతురిని ఉత్సాహపరిచింది.అంతేకాకుండా, సునంద హౌస్మేట్స్ అందరూ బాగా గేమ్ ఆడుతున్నారని పొగిడింది. మొదట షమితా స్నేహితుడు రాకేష్‌తో మాట్లాడిన ఆమె వారిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారని తెలిపింది. ప్రతి విషయంలోనూ కూతురికి సపోర్టుగా ఉంటున్నందుకు నేహకి ధన్యవాదాలు తెలిపింది.