శని శింగణాపూర్ -విశిష్టత!!

Shani Shingnapur village and temple history and importance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇది ఒక అద్భుతమైన పుణ్య క్షేత్రం. మహా రాష్ట్ర లోని శని శింగణాపూర్ గ్రామం లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్య క్షేత్రం. ఈ గ్రామం షిరిడి కి, ఔరంగాబాద్ కి మధ్య లో ఉన్నది …ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్బవించిన నల్లని రాతి విగ్రహం. ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో తెలియదు కానీ ఒక గొర్రెల కాపరి చెప్పిన ప్రకారం శని దేవుడు ఇక్కడ అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది ..కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం వున్నదని పేర్కొంటారు … గొర్రెల కాపరి చెప్పిన ప్రకారం గా చారిత్రిక కద ఈ రకంగాఉన్నది …

shani-shangnapur

గొర్రెల కాపరి పదునైన చువ్వ తో రాతి ని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది .ఈ ఘటన తో గొర్రెల కాపరి దిగ్బ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు . ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరు చూసారు .. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తానూ శనీశ్వరుడు ని అని .. రాతి విగ్రహం లో వెలిసానని చెప్తాడు. నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శని ని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని …. తనకి ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతి రోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు …. అంతే కాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు … కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు ..

shani-singapur

శని దేవుడు ఆ రకం గా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు గాని, దేవాలయం గోపురం గాని ఈ శని దేవుడి కి ఉండదు … ఆరు బయట ప్రదేశం లోనే చుట్టూ కొన్ని రాళ్ళని ప్రహారిగా పెట్టి పూజిస్తారు .. ఇక్కడ ప్రతి రోజు వేల మంది నువ్వుల నూనెతో , నువ్వులతో … దేవుడికి అభిషేకం చేస్తారు ..ఇంకో విషయము ఏమిటి అంటే ఇప్పటివరకు ఈ గ్రామం లో ఏ ఇంటికి కూడా తలపులు లేవు. ..ప్రభుత్వ ఆఫీస్లకి, ప్రైవేట్ సంస్థలకి ఒకటి ఏమిటి ప్రతి ఒక్కదానికి తలుపులు వుండవు ..దాని వెనుక కద, ఏంటి అంటే లోగడ దొంగతనం చేసిన వాళ్ళు గ్రామా పొలిమేరలు దాటేలోపే చనిపోయారు … ఇక అప్పటినుంచి ఎవ్వరు కూడా దొంగతనం చేయడానికి సాహసించరు …

new-news-on-shani-singapur-

ఇక ఈ క్షేత్రం కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే …. ప్రతి మనిషి కి జీవితం లో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది …ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు ..ఈ క్షేత్రం లో శని త్రయోదశి నాడు ఇసుక వేస్తె రాలని జనం వుంటారు …

shani-singapur-temple-up-da

చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ కూడా మహిళలకి ప్రవేశం లేదు అయితే చాలా మహిళా సంఘాలు పోరాటం చేసి శని దేవుడి గుడి లో ప్రవేశానికి అర్హత ఉందని కోర్ట్ ద్వారా విజయం సాధించారు ..అయితే కొన్ని దశాబ్దాలు గా మహిళలు ఎదురుకొన్న నిషేధాన్ని ఇప్పటికి ఛేదించగలిగారు … ఇక ఇప్పుడు శని దేవుడి ఆలయాన్ని చూడటానికి నీరు గా మహిళలకే పగ్గాలు అప్పగించారు … దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు మొదట గా షిరిడి ని దర్శించాక ఆ తరువాతా శని దేవుడి ని దర్శించుకుంటారు ..

shani-singapur-temple

నవ గ్రహాలలో ఏడో వాడు, సూర్య భగవానుడికి ఛాయా దేవి కి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి భక్తులు శనీశ్వరుడు ని భక్తి తో, శ్రద్ధతో ఎవరికి అన్యాయం చెయ్యకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి ..శనీశ్వరుడి కుడి చేతి లో దండం, ఎడమ చేతి లో కమండలం, ఖడ్గం ఉంటుంది ..శనీశ్వరుడి వాహనం కాకి ..

temple-up-dates

ఇక శని భార్య ఎవరో తెలుసా మీకు ..మందాదేవి మరియు లక్ష్మి దేవి సోదరి అయినా జేష్టాదేవి ., ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు ..శని భగవానుడు విషుణువు కి తోడల్లుడు , యమధర్మరాజు కి సోదరుడు …గ్రహాలకి యువరాజు ..శని కుమారుల పేర్లు మంది, కులగున్ …ఇక … నలుడు, హరిచ్చంద్రుడు, పురూరవుడు , సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తన తో సుఖాలను పొందారు ..శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడం తో సమానమని చెప్తారు … ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది అని చెప్తారు ..త్రేతాయుగం లో లంక లో రావణుండై అధీనం లో ఉన్న ఆంజనేయుడు ని శనీశ్వరడు విడిపించాడని ఒక కధనం ..అందుకే హనుమత్ దీక్ష లో ఉన్న వారిని, మందుడు కి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు బాధించడని చెప్తారు …

Shani-Shingnapur-village

యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు ..త్రేతాయుగం లో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞత గా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యం గా శనివారం లో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు … శని దేవుడు… మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు …అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు.

Shani-Shingnapur-village-an

ఫ్రెండ్స్ చూసారు కదా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి …తలుపులు లేని , దొంగల భయం అసలు లేని ఊరే శని శింగణాపూర్ …ఇప్పటివరకు భారత దేశం లో ఎక్కడ కూడా ఇలాంటి ఊరిని చూసి ఉండలేరు …. ఈ సారి మీరు మహారాష్ట్ర లోని షిరిడి పుణ్య క్షేత్రానికి వెళితే తప్పకుండా ఈ శని శింగణాపూర్ …ని తప్పక దర్శించండి ..శని దేవుడి కృప మీ పై ఉండుగాక..!!