తమిళ స్టార్ డైరక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 2.ఓ. ఈ చిత్రం ఇటవల విడుదలై మంచి విజయంను దక్కించుకుంది. దాదాపుగా 550 కొట్ల్లతో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాలోని ఓ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ సాంగ్ దాదాపు గా ఆ సాంగ్ కోసం నిర్మాతలతో 20 కోట్లు ఖర్చు పెట్టించాడు శంకర్. యంత్ర లోకపు సుందరివే… అంటూ సాగే ఆ సాంగ్ 2.ఓ విడుదలకు నెల రోజుల ముందే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సాంగ్ చిత్రం పూర్తైన తరువాత చివరలో టైటిల్ రోల్ అవ్వుతున్నా సమయం లో ప్లే చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు చాలా నిరాశకు లోనైయారు. కొంత మంది ఆ సాంగ్ మొత్తం చూడకుండానే వెళ్లి పోతున్నారు.
సినిమా స్క్రీన్ ప్లే సీరియస్ గా సాగుతున్నా సమయం లో పాటను పెట్టడం వలన ప్లో దెబ్బ తిని ప్రేక్షకులు విసుకుంటారని ఈ పాటను ను శంకర్ చివర్లో వేశాడు. కానీ ఈ పాటను ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటున్నారు అని తెలవడం తో నేటి నుండి సినిమా సెకండ్ ఆఫ్ మద్యలో వేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ సాంగ్ తో సినిమా పైన ఇంకా మంచి హైప్ వస్తుంది అని భావిస్తున్నారు. మొదటి రోజు దాదాపుగా 100 కోట్లను దక్కించుకున్న ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.