ట్రంప్ దెబ్బ‌కు మార్కెట్లు కుదేలు

Share Markets Crash Due To Donald Trump Trade Market Restrictions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ దెబ్బ‌కు భార‌త స్టాక్ మార్కెట్లు బెంబేలెత్తాయి. చైనా దిగుమ‌తుల‌పై ట్రంప్ విధించిన వాణిజ్య ఆంక్ష‌లు మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. ట్రంప్ నిర్ణ‌యం ప్ర‌పంచ వాణిజ్య యుద్ధానికి దారితీయ‌వ‌చ్చ‌న్న భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో మార్కెట్లు భారీ ప‌త‌నాన్ని న‌మోదుచేశాయి. ట్రంప్ వాణిజ్య ఆంక్ష‌ల‌తో అమెరికా, ఐరోపా మార్కెట్లు డీలాప‌డ‌డంతో ఈ ఉద‌యం మ‌న మార్కెట్లు భారీ న‌ష్టాలతో ప్రారంభ‌మ‌య్యాయి.
450 పాయింట్ల‌కు పైగా న‌ష్టంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ఒక ద‌శ‌లో 500 పాయింట్ల‌కు పైగా ప‌త‌న‌మైంది. చివ‌ర‌కు కాస్త కోలుకుని 410 పాయింట్ల న‌ష్టంతో 32, 596వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 117 పాయింట్ల న‌ష్టంతో 9,998వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీలో వేదాంతా లిమిటెడ్, హిందాల్కో షేర్లు భారీగా న‌ష్ట‌పోయాయి. బీఎస్ ఈలో యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్ కేర్, సెయిల్, జై కార్పొరేష‌న్ భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్నాయి.