తాను బ్రాహ్మణుడినని నమ్మించి హిందూ యువతిని ఏకంగా పెళ్లి చేసుకున్నాడో ఓ ముస్లిం వర్గానికి చెందిన యువకుడు. రాజస్తాన్‌లోని సిఖార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇమ్రాన్ భాటి అనే వ్యక్తికి పెళ్లై, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన పేరు కబీర్ శర్మ అని బాధిత కుటుంబంతో పరిచయం పెంచుకున్న ఇమ్రాన్ తమది సంప్రదాయ కుటుంబమని వధువు కోసం వెదుకుతున్నామని చెప్పేవాడు. ఈ క్రమంలో అతడిని గుడ్డిగా నమ్మిన బాధిత కుటుంబం తమ కూతురినిచ్చి వివాహం జరిపించేందుకు అంగీకరించారు. మే 13న జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా 11 లక్షల రూపాయలు, రూ. 5 లక్షల విలువైన నగలు, ఖరీదైన దుస్తులు కానుకలుగా ఇచ్చారు. అయితే పెళ్లైన రెండోరోజే అదనపు కట్నం తేవాలంటూ నవ వధువును వేధించసాగా డు నకిలీ శర్మ. ఈ విషయం ఆమె తల్లిదండ్రుల దృష్టికి రావడంతో ఇమ్రాన్ ఇంటికి వెళ్లి చూడగా అతడికి ఇది వరకే పెళ్లైందని, అతడొక ముస్లిం అని తెలిసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఇమ్రాన్‌తో సహా తమ కూతురు కనిపించకుండా పోయిందని మరో సారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమెకు ఈ వ్యక్తి ముందే తెలుసా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడితో ఆమెకు ముందే పరిచయం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.