వైసీపీ ప్లీనరీలో… వైఎస్ షర్మిల ప్రసంగం

Sharmila Speech In YS Plenary

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Sharmila Speech In YS Plenary

ఒక్క కడప జిల్లాలో ఎంపీ సీటుకు జగన్ కు దాదాపు 6లక్షల మెజార్టీ వచ్చింది- ఒక్క ఎంపీ సీటుకు 6లక్షల మెజార్టీ చాలా పెద్ద విషయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వచ్చిన 5లక్షల ఓట్ల మెజార్టీ చాలా చిన్న విషయం- ఆ ఓట్లు కూడా చంద్రబాబు మొఖం, ఆయన విశ్వసనీయత చూసి కాదు- గతంలో ఏ మోదీనైతే రాక్షసుడు అని తిట్టాడో 2014లో అదే మోదీపై సవారీ అయితే వచ్చింది- ఏ వ్యవసాయమైతే దండగా అన్నాడో అదే రైతులకి ఎంత రుణమున్నా మాఫీ చేస్తానని తప్పుడు వాగ్దానం చేస్తే వచ్చింది- అధికారం శాశ్వతమని విర్రవీగతున్న చంద్రబాబు రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని, పేద విద్యార్థుల్ని, తెలగుదేశం పార్టీకి ఓట్లేసిన వారందర్నీ మోసం చేశాడు- ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడు- తర్వాత ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు- చంద్రబాబువి అబద్దపు రాజకీయాలు.

 ప్లీనరీలో వైఎస్‌ షర్మిల ప్రసంగాన్ని ప్రారంభించారు. నాన్న లేని లోటు మాటల్లో చెప్పలేనని, తాను రైతు పక్షపాతినని చెప్పుకున్న మహా నేత వైఎస్సార్‌ అని అన్నారు. వైఎస్సార్సిపి బలం ప్రజలకు వైసిపిమీద ఉన్న అభిమానం, జగనన్న మీద ఉన్న నమ్మకం అని, ఈ బలం మరే పార్టీకి లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలోనే లేదని, అబద్ధాలు చెప్పటం తమకు చేతకానిపనిఅన్నారు. రాజన్న రాజ్యాన్ని త్వరలో జగనన్న తీసుకొస్తాడని, దీనిని ఆ దేవుడు సుసాధ్యం చేస్తాడని, జరగబోయేది ఇదేనని ఆమె భవిష్యత్‌ చెప్పారు.

ఎవరూ ఊహించని పథకాలు ప్రవేశపెట్టి వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని షర్మిల అన్నారు. ప్లీనరీలో ఆమె మాట్లాడుతూవైఎస్సార్‌ ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ ఎంతోమందికి పునర్జన్మనిచ్చిందని, విద్యార్థుల తలరాత మార్చిన మహానేత వైఎస్సార్‌ అని కొనియాడారు. మోసపూరిత హామీలిచ్చి ఉంటే ఎప్పుడూ అధికారంలోకి వచ్చేవాళ్లమని, మాట ఇచ్చి తప్పడం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే మేలని జగనన్న భావించారని, ప్రజలు సంతోషంగా ఉండాలన్నది నాన్న కోరిక అయితే జగన్నది సంకల్పమన్నారు.
 ప్లీనరీ సందర్భంగా ప్రసంగాన్ని ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ. ’35సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తే వారు ఏం చేశారో అందరికీ తెలుసు. రాజశేఖర్‌ రెడ్డిగారి వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబం పట్ల కాంగ్రెస్‌ పార్టీ కఠినంగా వ్యవహరించింది’- వైఎస్‌ విజయమ్మ

 వైఎస్ మరణించిన అనంతరం జగనే సిఎం కావాలని 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారనీ, అయినా జగన్ వారిని వారించి రోశయ్య ముఖ్యమంత్రి కావడానికి పూర్తిగా సహకరించారని విజయమ్మ చెప్పారు. వైకాపా ప్లీనరీ రెండో రోజు ఆమె మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వారం రోజులకే జగన్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే జగన్ పై అక్రమ ఆస్తుల కేసులు బనాయించారని ఆమె విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైకాపా వైఎస్ ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తుందని విజయమ్మ ఉద్ఘాటించారు.