బాలీవుడ్‌ ఎంట్రీకి షారుక్‌ కూతురు

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ జోయా అక్తర్‌ దర్శకత్వంలో డెబ్యూ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజాగా ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరిపేందుకు సుహానా జోయా ఆఫీస్‌ను సందర్శించడం మీడియా కంట పడింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సుహానా బాలీవుడ్‌ ఎంట్రీపై బీటౌన్‌లో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇక గతంలోనే తన కూతురు హీరోయిన్‌గా కనిపించాలనుకుంటుందని షారుక్‌ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.