విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్

విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్

హీరో నాని నిన్న జరిగిన జానూ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించినా పలు ఆసక్తికర విషయాలని ప్రేక్షకులతో సభాముఖంగా పంచుకున్నారు. నిర్మాత దిల్ రాజు 96 చిత్రాన్ని రీమేక్ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు, నా ఒపీనియన్ అడిగారు, అపుడు నేను 96 ని టచ్ చేయకండి అని చెప్పా, విజయ్ సేతుపతి, త్రిష లు చాల బాగా చేసారు, టచ్ చేయొద్దు అని అన్నట్లుగా తెలిపారు. అయితే ఈ చిత్రం లో శర్వానంద్, సమంత లు నటిస్తున్నారు అని తెలియడం తో తెలుగులో ఎందుకు చేయడం అని అనిపించలేదు, ఎపుడు చూస్తామా అని అనిపించింది అని నాని అన్నారు.

అయితే అప్పటినుండి 96 నా బ్రెయిన్ నుండి డిలీట్ అయి, ఇపుడు జానూ అంటే వీరిద్దరే గుర్తొస్తున్నారు అని నాని అన్నారు. అయితే శర్వానంద్ గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీ కి వచ్చాక నా ఫస్ట్ ఫ్రెండ్ అని, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ పాత ఫ్రెండ్స్ ని కలవడం అని, నువ్ కూడా సినిమాలు చేసుకోవడం మాత్రమే కాకుండా, పాత ఫ్రెండ్స్ ని కలిస్తే బావుంటుందని నా ఫీలింగ్ అని నాని అన్నారు. శర్వానంద్ చేసిన సినిమాకి ఏదైనా పేరు వచ్చినా, రాకపోయినా శర్వానంద్ కి పేరు వస్తుందని నాని అన్నారు. ఈ చిత్రానికి మంచి పెరఫార్మర్ అవసరం అందుకే విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్ ని తీసుకున్నారు అని నాని అన్నారు.

అయితే సమంత గురించి ప్రస్తావిస్తూ, ఏటో వెళ్ళిపోయింది సినిమా ఇపుడు వచ్చి ఉంటే ఆ సినిమా ఒక లెవెల్లో ఉంటుందనేది నా ఫీలింగ్ అని నాని అన్నారు. అయితే ఈ చిత్రంలో ఉన్న పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా సొంతమే అని డైలాగు ని పది నెలలు కష్టపడి జానుని తీసిన ప్రొడ్యూసర్ కి సొంతం అయితే ఫిబ్రవరి 7 నుండి చూసి ఎంజాయ్ చేసే మీకందరికీ కూడా సొంతమే అని నాని అన్నారు.