టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును కూడా బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అదే విధంగా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా కూడా రోహిత్ నియమిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు. అదే నిజమే అంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తన భార్య రితిక సజ్దే తన క్రికెట్ కెరీర్లో కీలక పాత్ర పోషించిందని రోహిత్ చెప్పాడు.
“ఆమె నా నెం.1 సపోర్ట్ సిస్టమ్. అందులో ఏం సందేహం లేదు. ఇన్నాళ్లూ ఆమె నాకు అండగా నిలిచింది. నా పక్కన ఉంటూ నా కష్టాలను పాలు పంచుకుంది. ఆమె నా కెరీర్లో ముఖ్య పాత్ర పోషించింది. నేను క్రికెటర్‌గా మరింత ఎదగాలని తపనతో ఎల్లప్పడూ ఉంటుంది. నేను సాధించే ప్రతీ విజయంలో తన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది” అని బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా షోలో రోహిత్ పేర్కొన్నాడు.
“మేము ఇద్దరం ఒకటే. నేను విఫలమైతే, ఆమె కూడా విఫలమయ్యనట్లే. నేను విజయం సాధిస్తే, ఆమె కూడా విజయం సాధించినట్లే. భవిష్యత్తులో కూడా మేము ఇలానే ఉండాలని నేను భావిస్తున్నాను” అని రోహిత్ తెలిపాడు. ఇక రోహిత్ డిసెంబర్ 13, 2015 న రితికను వివాహం చేసుకున్నాడు. వారి వివాహ బంధానికి గుర్తుగా గుర్తుగా సమైరా పుట్టింది.