అయోధ్యపై శివసేన ఆరోపణలు

అయోధ్యపై శివసేన ఆరోపణలు

అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని శివసేన ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేపడుతున్నారని దుయ్యబట్టింది. కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో రానున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భూమిపూజ నిర్వహిస్తున్నారని ఆరోపించింది.

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మందిర నిర్మాణంతో పాటు అభివృద్ది పనులను హడావిడిగా చేపట్టారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. ఆగస్ట్‌ 5న అయోధ్యలో నిర్వహించే భూమిపూజకు మందిర నిర్మాణ ఉద్యమంతో మమేకమైన కీలక వ్యక్తులను ఆహ్వానించాలని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా కేవలం 200 మందినే అనుతిస్తారు.