ఏపీ సీఎం జగన్‌కి సీబీఐ షాక్

ఏపీ సీఎం జగన్‌కి సీబీఐ షాక్

ఏపీ సీఎం జగన్‌కి సీబీఐ షాక్ ఇవ్వబోతుంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లపై సీబీఐ కౌంటర్ పిటీషన్‌ను హైకోర్ట్‌లో సమర్పించనుంది. అయితే బెయిల్ షరతులను జగన్ అతిక్రమిస్తున్నారని, హాజరు మినహాయింపు కోసం జగన్ పిటిషన్లు విచారణార్హం అని పిటీషన్‌లో పేర్కొంది. రాజకీయ, ధన బలాన్ని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేయాలని చూస్తున్నారని తెలిపింది.

అయితే ఏదో ఒక నెపంతో విచారణ మినహాయింపు కోరుతున్నారని, తీవ్రమైన ఆర్థిక కుంబకోణాన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు మినహాయింపు ఇవ్వద్దని అన్నారు. సీఎం అయిన తరువాత జగన్‌ ఒక్కసారే సీబీఐ కోర్టుకు హాజరయ్యారని అన్నారు. జగన్‌ హోదా మారిందన్న కారణంగా మినహాయింపు ఇవ్వరాదని పేర్కొంది. సీబీఐ, ఈడీ కలిపి వేసిన 16 చార్జ్‌షీట్లలో జగన్‌ నిందితుడిగా ఉన్నారని తెలిపింది. కేసు నమోదైనప్పటి నుంచి జగన్ రాజకీయాల్లోనే ఉన్నారని, సీఎం అయితే చట్టాలు మారవని తెలిపింది. హాజరు మినహాయింపు కోరడం ఆర్టికల్ 14కు విరుద్ధమని జగన్ పిటిషన్లపై ఏప్రిల్ 9న హైకోర్టులో విచారణ జరుపుతామని పేర్కొంది.