వైసీపీ పార్టీ పై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు

వైసీపీ పార్టీ పై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ సృష్టించిన ప్రభంజనానికి మిగతా పార్టీలన్నీ కూడా చతికిల పడిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత చంద్రబాబు నాయుడు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఇక మిగతా పార్టీ నేతలు అందరు కూడా చాలా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్నారు. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేష్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చూస్తే వైసీపీ పార్టీ తన బలగాన్ని పెంచుకునే పరిస్థితి కనిపిస్తుందని అందరు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్నీ స్వయంగా వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ అధికారికంగా వెల్లడించారు.

కాగా మీడియా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ… వైసీపీ పార్టీ పై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రంలో తొందర్లోనే వైసీపీ పార్టీ కి సంబందించిన ఎమ్మెల్యేల సంఖ్య తొందర్లోనే పెరగనుందని వెల్లడించారు. కాగా ఇప్పటివరకున్నటువంటి 151 మంది కాస్త 153 కి చేరనుందని, అవసరమైతే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయని వెల్లడించారు.

దానికి కారణం ఇటీవలే తెలుగుదేశం పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మీద తిరుగుబాటు చేసిన కారణంగా పార్టీ వంశీని సస్పెండ్ చేసింది. ఇకపోతే మరొక టీడీపీ నేత గిరి కూడా తొందర్లోనే పార్టీ వీడనున్నాడని వార్తలు కూడా బాగా వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిరువురు టీడీపీ నేతలు కూడా త్వరలో వైసీపీ లో చేరనున్నారని, అందుకనే త్వరలోనే వైసీపీ పార్టీ బలగం పెరగనుందని సమాచారం వస్తుంది. అయితే రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బలగాన్ని పెంచుకుంటున్నాడని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.