ప్రపంచ వ్యాప్తకంగా కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో లాక్ డైన్ విధించింది కేంద్రం. దేశం మొత్తం మీద ఇప్పటివరకు 18,800కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా రాష్ట్రపతిభవన్‌లో పనిచేసే ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ తేలిందనే వార్త సంచలనం సృష్టించింది.
తాజాగా పార్లమెంట్‌లోని లోక్‌సభలో పనిచేసే ఒక ఉద్యోగి కోవిడ్-19 పాజిటివ్‌గా తేల్చారు. లోక్‌సభలోని హౌస్‌కీపింగ్ విభాగంలో అతను పనిచేస్తాడని అధికారులు వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా గత మార్చి 23న పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డప్పటి నుంచి అతను ఇంటికే పరిమితమయ్యాడు. పది రోజుల కిందట అనారోగ్యానికి గురికాగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చూపించు కున్నాడు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఏమీ లేదని తేల్చి చెప్పారు. అయితే తాజాగా ఈనెల 18న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో వెంటనే అతడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అతనికి భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అలాగే మనవలు కూడా అతనితో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ మొదటి రెడు స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే.