తెలంగాణాలో ఆర్టీసీకి  మరో షాకింగ్ న్యూస్

తెలంగాణాలో ఆర్టీసీకి  మరో షాకింగ్ న్యూస్

తెలంగాణాలో ఆర్టీసీ  ఇప్పటికే పెరిగిన చార్జీల విషయంలో ప్రజలు నానా అవస్దలు పడుతుంటే వీటికి తోడు ప్రతి నిత్యావసర ధరలు ఒక్కొక్కటి మెల్లమెల్లగా పెరుగుదల వైపుపరిగెడుతున్నాయి.ఇకపోతే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్. అదేమిటంటే నగరంలో తిరుగుతున్న సిటీ బస్సుల సంఖ్యను మరో మూడు రోజుల్లో అధికారులు తగ్గించనున్నారట. ఈ క్రమం లో గురువారం నుంచే కొద్ది కొద్దిగా తగ్గిస్తూ శనివారం నాటికి వెయ్యి బస్సులు తొలగించాలని ఇప్పటికే డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయట. ఇప్పటికే వెయ్యి బస్సులు తొలగించాలని అధికారులు నిర్ణయించారట. ఈ తతంగమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జరుగుతున్నదట.

ఇందుకు గాను డిపోల వారీగా తగ్గించే బస్సుల సంఖ్య తో కూడిన జాబితా కూడా సిద్ధం చేశారు. ఈ జాబితాలో హైదరాబాద్‌ రీజియన్‌లో 550, సికింద్రాబాద్‌ రీజియన్‌లో 450 బస్సులను చేర్చారు. ఇకపోతే ఒకేసారి వెయ్యి బస్సులను ఆపేస్తే ఆదాయం పడిపోతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయని డిపో మేనేజర్లు అంటున్నారు. బస్సులను తగ్గించినా సిబ్బందిని తొలగించే పరిస్థితి లేనందున వారి వేతనాల రూపంలో ఖర్చు అలాగే ఉంటుందని, అందుకే ఈ నిర్ణ యంపై పునరాలోచించు కోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక చార్జీలు పెంపుతో ఆదాయం పెరుగుతున్నందున, అన్ని బస్సులు సరిగ్గా నడిపితే నష్టాలు చాలా వరకు తగ్గించవచ్చు కాని ఇప్పుడు తీసుకునే నిర్ణయంతో ముందు ముందు ఎన్ని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందోనని దీనిపై అన్ని డిపోల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణ ప్రజలు అభివృద్ది చెందే మాట అటుంచితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాయకులు మాత్రం చాలా అబివృద్ది చెందారంటూ నిరుద్యోగులు తమ ఆవేశాన్ని వెళ్లకక్కుతున్నారు..