డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని అడిగిన చెన్నకేసువులు భార్య

డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని అడిగిన చెన్నకేసువులు భార్య

దిశ.. ఈ పేరు గురించి దేశవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే ఆమె ఘటన ఒక దారుణం. వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను సజీవదహనం చేశారు నలుగురు నిందితులు. కనీసం ఆమె శరీరాన్ని ముట్టుకోను కూడా ముట్టుకోనివ్వకుండా చంపేశారు ఆ నీచులు.

అయితే ఈ విషాదంతో ఆ నలుగురు నిందితుల కుటుంబంలో ఒకరైన చెన్నకేసువులు భార్య రేణుక అనే ఆమె భర్త పోతే పోయాడు.. నాకు ఓ పది లక్షల ఇల్లు.. డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయినా ఇప్పియండి మాకు న్యాయం చెయ్యండి అంటూ యూట్యూబ్ ఛానెల్స్ ముందు గోలగోల చేసింది. దీంతో ఆ వార్తలు రెండు రోజులు హల్ చల్ చేసాయి.

అయితే ఆమె భర్త ఏదో దేశం కోసం చచ్చినట్టు ఆమె నష్టపరిహారం అడిగింది.. నిజానికి ఆ నలుగురు నిందితుల కుటుంబాలు పేద కుటుంబాలే.. కానీ ఆ కుటుంబంలో పుట్టినందుకు కష్టపడి తల్లిదండ్రులను ఆనందగా చేసుకోవాల్సింది పోయి ఒక ఆడపిల్లను అమానుషంగా చంపారు.. అలాంటి నీచుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తే.. దిశ కేసులో నిందితుల్లాంటి నింధితులు దేశంలో ఎంతమంది పుట్టుకొస్తారు..