విడుదలకు ముందే రికార్డ్స్ ను సృస్తిస్తున్నా 2.ఓ…!

Shocking Price For Robo 2.0 Movie Ticket

రోబో కి సీక్వెల్ గా 2.ఓ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శంకర్ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నాడు. ఇటివల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సు రావడంతో సినిమా స్థాయే మారిపోయింది. సినిమా ట్రేడ్ పండితుల అభిప్రాయం ప్రకారం మొదటి రోజు మంచి టాక్ వస్తే మాత్రం బాహుబలి 2 రికార్డు ను బద్దలు కొడుతుంది అంటున్నారు.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. మెట్రో సిటీల్లో ఆన్ లైన్ బుకింగ్ టికెట్స్ ధరలు రజినీకాంత్ క్రేజీని దృష్టి లో ఉంచుకొన్ని అమాంతం పెంచేశారు.

robo2.0-ovie-heroin

ఆన్లైన్ బుకింగ్ వివరాలు కనీసం టికెట్ ధర 118 కాగా గరిష్టం గా 1550 రూపాయలతో ముంబాయిలో విక్రయిస్తున్నారు. అయినా కూడా టికెట్స్ మాత్రం పెట్టిన నిమిషాల్లో అమ్ముడు పోతున్నాయి. ఆల్రెడీ కొన్ని థియేటర్స్ క్లోసింగ్ బోర్డు కూడా పెట్టేశాయి. రెండో స్థాన్నలో దేశ రాజధాని ఢిల్లీ లో 1450 రూపాయలు, కోల్ కత్తా లో 1030 మూడో స్థాన్నంలో ఉన్నది. ఆ తరువాత స్థాన్నంలో బెంగళూర్, పూణే, చెన్నై, నగరాల్లో వెయ్యి తక్కువ కాక్కుండా అమ్ముతున్నారు. 600 కోట్ల బడ్జెట్ మూవీకి ఈ మాత్రం పెట్టాల్సిందే అని థియేటర్ యజమాన్యం అంటున్నారు.

robo-2.0