ఈ మధ్యకాలం లోనే నందమూరి బాలయ్య పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం మరియు దానికి సంబంధించిన కొన్ని సంఘటనలు బాలయ్యకు సంబంధించిన వివాదానికి దారితీశాయి.నిజానిజాలు తెలియకుండానే బాలయ్యపై తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాలయ్య సహనటి అంజలి దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించిన వీడియో క్లిప్ వార్తల్లో వైరల్‌గా మారింది. అయితే దీనిపై స్పందించాల్సిన వారు స్పందించారు. తమ బంధం ఏంటో క్లారిటీ ఇస్తూ తాజాగా బాలయ్య గురించి ఓ పోస్ట్ పెట్టింది అంజలి.
తాము ఇద్దరం ఎపుడు ఎంతో స్నేహంగానే ఉంటామని మేమిద్దరం కూడా ఎప్పుడూ ఒకరు పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని తెలిపి ఈవెంట్ లో వారి మధ్య కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వీడియో రూపంగా పెట్టింది. బాలయ్య ఆమెతో చిరునవ్వుతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అలాగే ఆమెను తోసేస్తున్న క్లిప్ కూడా ఉంది. ఇదిలావుండగా, బాలయ్యతో ఎలాంటి ఇష్యూ లేదని అంజలి చెబుతూ, రచ్చ చేసేవారు తమ నిజానిజాలు చూసుకోవాలని సూచించారు.
https://x.com/yoursanjali/status/1796260781551682021