భయపడుతున్న శ్రుతీ హాసన్

భయపడుతున్న శ్రుతీ హాసన్

ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో.. ఎలాంటి దారుణమైన విషయాలు వింటున్నామో అందరికీ తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందనే వార్తలు ఇప్పటికే అందరిలోనూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నాయి. ప్రజలు కూడా కరోనా పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సినిమా పరిశ్రమలో మాత్రం పనులు చకాచకా జరుగుతున్నాయి.

అందరూ కూడా కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తున్నారు.షూటింగ్ కోసం ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.అసలే శ్రుతీ హాసన్ ముంబై చెన్నై హైద్రాబాద్ అంటూ తిరుగుతూ ఉన్నారు.

ఈ మధ్యే ముంబై నుంచి హైద్రాబాద్‌కు వచ్చారు. ఇక సలార్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. రోజూ షూటింగ్ సెట్‌కు వెళ్లే ముందు కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ఇప్పటికి ఐదు వేల సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను అని చెప్పుకొచ్చారు. అయినా కూడా సేఫ్టీనే ఫస్ట్ కదా? అని శ్రుతీ హాసన్ చెప్పుకొచ్చారు. అసలే మొన్న సలార్ సెట్ మీద దాదాపు 20 రకాల ఫుడ్ ఐటంలను ప్రభాస్ తెప్పించగా.. శ్రుతీ హాసన్ లొట్టలేసుకని మరీ తిన్నారు. ఆ వీడియో నెట్టింట్లో బాగానే వైరల్ అయింది.