‘‘నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్. సెల్ఫ్‌లవ్ గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం స్వీకరించుకోవాలి. నా కళ్లను గమనిస్తే నల్లని మచ్చలు కనబడతాయి. అవును.. నా కళ్లలో పుట్టుమచ్చలు ఉన్నాయి. దానికి నేనేం బాధపడటంలేదు. ఇది జబ్బు కూడా కాదు.
ఆ మచ్చలు నా కళ్లలో ఎప్పటినుంచో ఉన్నాయి. అవి నాకు సూపర్ స్పెషల్. మనల్ని మనలా గుర్తించే ప్రతి అంశం మనకు గొప్పదే’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. అలాగే తన కంటిలో ఉన్న పుట్టుమచ్చలు కనిపించేలా ఓ ఫొటోను షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికి వస్తే… తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’, తమిళంలో విజయ్‌సేతుపతి నటిస్తున్న ‘లాభం’ చిత్రాల్లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు.