నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం శ్రుతీహాసన్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ కోసం శ్రుతీ.. రూ.2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రుతీహాసన్ డిమాండ్‌కు ఓకే చెప్పారట. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం కావడం గమనార్హం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై బాలయ్య’అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య.. మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.