హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ షో చేయడానికే పరిమితం అనే రోజులు పోయాయి. పాత తరం హీరోయిన్స్ వలె ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ కూడా ఎలాంటి రోల్స్ చేయడానికైనా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్స్ సైతం నెగిటివ్ రోల్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రమ్యకృష్ణ ‘నరసింహా’ సినిమాలో ప్రతినాయకి పాత్రలో మెప్పించింది. ‘నిజం’ సినిమాలో హీరోయిన్ రాశి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించి అలరించింది.
ఇప్పటి హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ ‘పందెం కోడి 2’ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాల్లో లేడీ విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమాలో కూడా వరలక్ష్మి ప్రతినాయకిగానే కనిపించనుందని సమాచారం. యాంకర్ అనసూయ ‘క్షణం’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి.
ఇక సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని సైతం లేడీ విలన్ గా కనిపించడానికి వెనకాడటం లేదు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత పాకిస్థానీ టెర్రరిస్టుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుందని సమాచారం. నిజానికి విక్రమ్ హీరోగా నటించిన ’10’ సినిమాలో ఒక పాత్రలో సామ్ లేడీ విలన్ గా నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ లాంటి చాలా మంది హీరోయిన్స్ హ్యాపీగా నెగటివ్ రోల్స్ పోషించడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా లేడీ విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
బాలీవుడ్ లో సత్తా చాటాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న శృతి హాసన్ ఇటీవల పలు హిందీ సినిమాలు చేసింది. ఈ క్రమంలో శృతి నటించిన ‘యారా’ మూవీ జూలై 30న జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది. రీసెంటుగా ఈ బ్యూటీ మరో బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పిందట. కాకపోతే ఈ సినిమాలో అమ్మడు నెగటివ్ రోల్ ప్లే చేయబోతోందట. డెబ్యూ మూవీ ‘లక్’ నుంచి బాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనిపించుకోవాలని చూస్తున్న శృతి హాసన్ ఇప్పటికైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి. ఇక తెలుగులో ఈ భామ చాలా గ్యాప్ తీసుకొని రవితేజ సరసన ‘క్రాక్’ మరియు పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సినిమాల్లో నటిస్తోంది.