రెండేళ్ల గ్యాప్‌ తరువాత శ్యామ్‌ సింగరాయ్‌‌

రెండేళ్ల గ్యాప్‌ తరువాత శ్యామ్‌ సింగరాయ్‌‌

సుమారు రెండేళ్ల గ్యాప్‌ తరువాత శ్యామ్‌ సింగరాయ్‌‌ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు నాని. దీనికంటే ముందు నాని నటించిన వి, టక్‌ జగదీష్‌ చిత్రాలు రెండూ నేరుగా ఓటీటీలోనే రిలీజయ్యాయి. దీంతో చాలాకాలం తర్వాత నాని శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో మళ్లీ థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఏదో ఏదో తెలియని లోకమా.. లిరికల్‌ సాంగ్‌ రిలీజైంది.

చెవులకు వినసొంపుగా ఉన్న ఈ పాటను చైత్ర ఆలపించగా మిక్కీ మేయర్‌ సంగీతం సమకూర్చారు. కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించారు. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా ముగ్గురు హీరోయిన్లు జత కడుతున్న విషయం తెలిసిందే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో క్రిస్‌మస్‌ రోజే రిలీజైన ఎమ్‌సీఏ పెద్ద హిట్టవడంతో శ్యామ్‌ సింగరాయ్‌ కూడా సూపర్‌ హిట్‌ అవుతుందని ఆశలు పెట్టుకున్నాడు నాని!