జగిత్యాల పట్టణ ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా పట్టుబడ్డాడు. ఎస్సై శివకృష్ణ ఓ బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బాధిత వ్యక్తి నుంచి ఏకంగా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించగా.. వల పన్నిన అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
అయితే, పట్టుబడ్డ అనంతరం ఎస్సై విపరీతంగా బాధ పడ్డారు. తన పరువు పోతుందని ఏడ్చేశారు. బల్లపై ముఖం దాచుకొని మరీ వెక్కివెక్కి ఏడ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.