అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడం పెనుకొండలో విషాదం నింపింది. ఒకేరోజు ముగ్గురు విష పదార్థం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండలోని పదవీ విరమణ పొందిన బ్యాంక్ ఉద్యోగి అశ్వర్థప్ప (65) నివాసంలో దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగ అశ్వర్థప్ప, అతడి ఇద్దరు సోదరిలు విగతజీవులుగా పడ్డారు.
అయితే వారు కొన్నిరోజుల కిందట విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో అనే విషయం ఇంకా తెలియరాలేదు.