నాని సినిమాలో తమిళ హీరో విలన్…!

Siddharth Grand Son Role In Bharateeyudu2

తమిళ హీరో సిద్ధార్థ్ ప్రస్తుతానికి సినిమాలు ఏవి చెయ్యకుండా ఖాలీ గానే ఉన్నాడు. ఈ మద్య అతని సినిమాలు ఏవి సక్సెస్ లు దక్కించుకోలేక పోయాయి. ఈ హీరో తెలుగు వారికీ భాగా సుపరిచితం, తెలుగు లో భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం తరువాత సిద్ధార్థ్ కి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటనా చిత్రం సిద్ధార్థ్ కెరీర్ లోనే సూపర్ హిట్ట్ చిత్రంగా నిలుస్తుంది. తెలుగు ఈ రెండు చిత్రాలు మాత్రమే మంచి పేరును తెచ్చిపెట్టాయి ఆ తరువాత వచ్చిన చిత్రాలు పరాజయం పాలు అవ్వడంతో, తన మకాం తమిళనాడు మార్చేశాడు.

sidharth-nani

ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ గురుంచి ఓ వార్త ఫిల్మ్ నగర్లో ఓ టాక్ ఉన్నది. ఆయన తెలుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అని, కానీ ఈసారి అయన హీరో గా కాదు విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడట. నాని తో విక్రం కె కుమార్ ఓ చిత్రానికి చెయ్యబోతున్న సంగతి తెలిసిందే, ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నాడు. సిద్దర్ద్ ని కలిసి స్టొరీ వినిపించాడు. సిద్ధార్థ్ కూడా ఓకే చెప్పడం జరిగిందంట. ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కనున్నది. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి అని అంటున్నారు. అది పినిశెట్టి కూడా ఇదే తరహాలో తెలుగులో, విలన్ కామ్ హీరో గా రానిస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో సిద్ధార్థ్ కూడా రావడానికి ప్లాన్ చేస్తున్నట్లున్నాడు.