రాజమౌళి 12-12-12.. ఈసారి ఏంటో?

Ajay Devgn Not Interested On SS Rajamouli RRR Movie

రాజమౌళి బాహుబలి తరువాత చేస్తునటువంటి మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. టైటిల్ విషయంలో అధికారికంగా ప్రకటించావలిసి ఉన్నది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 11 -11-11 ని కి ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారు అని నెల రోజుల నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగించారు. అనుకున్న విధంగానే 11-11-11-ని లాంచ్ చేశారు. అదే రోజు ఈ సినిమా హీరోస్, ఈ చిత్రానికి పనిచేసే టెక్నీషియన్ ను అనౌన్సు చేశారు. ప్రస్తుతానికి దగ్గర్లో ఉన్న డేట్ 12-12 న రాజమౌళి ఈ చిత్రానికి సంబందించిన కీలక అనౌన్సు మెంట్ చేయ్యనున్నాడట. అంటే పైన చెప్పిన డేట్ కి హీరోస్ ని అనౌన్సు చేసిన రాజమౌళి 12-12-12 ఈ చిత్రానికి సంబందించిన హీరోయిన్స్ ని అనౌన్సు చేస్తాడు అని ఫిల్మ్ నగర్లో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది.

రాజమౌళి 12-12-12.. ఈసారి ఏంటో? - Telugu Bullet

రాజమౌళి తర్వాత మ్యాజిక్ డేట్ పైన కూడా మంచి హైప్ తిసుకురనున్నాడని తెలుస్తుంది. మొత్తానికి రాజమౌళి ఇప్పటి నుండే సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసినట్టు ఉన్నాడు. ఈ చిత్రం గురుంచి ఎదో ఓ న్యూస్ తో సోషల్ మీడియాలో ఉంటుంది. పైన చెప్పిన తేది పైన ఈ సినిమా చిత్ర బృందం నుండి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డివివి దానయ్య నిర్మిస్తున్నా ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లపైన భారీ ఆక్షన్ ఫైట్ తీస్తున్నాడు.