చంద్రబాబు తెలిసి సుహాసిని ని బలిపశువు చేస్తున్నారు – కేటీఆర్…!

KTR Shocking Comments On TRS Leaders

నిన్న గురువారం నాడు కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌ నియోజక వర్గాలలో నిర్వహించిన రోడ్ షో లలో కేటీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో భాగంగా “తెలంగాణాలో ఉన్న సెటిలర్లతో మాకు ఏమైనా తగాదాలు ఉన్నాయా, ఈ నాలుగున్నర ఏళ్లలో ఇక్కడి సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బందైన కలగనిచ్చామా, ఇప్పుడు తన రాజకీయ లబ్ధికోసం ఇక్కడి తెలంగాణాలో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు తనని విమర్శిస్తే సీమాంధ్రులను విమర్శించినట్లే అని మాట్లాడుతున్నారు. తెలంగాణాలో టీడీపీ అభ్యర్థి గెలిచినా, ఓడినా చంద్రబాబు కి ఒరిగేదేమి ఉండదు. కానీ,నష్టమంతా మనకే. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. ఈ అభివృద్ధిలో సీమాంధ్రులతో సహా మనందరి ప్రయోజనాలు ఉన్నాయి. కూకట్ పల్లి అభ్యర్థిగా సుహాసిని గారిని నిలబెట్టిన చంద్రబాబు తన నయవంచన తో మరోసారి నందమూరి కుటుంబాన్ని బలిపశువుగా చేయబోతున్నారు.

trs-tdp-sushani

మీరే చెప్పండి…ఒకవేళ చంద్రబాబు కి నందమూరి ఫ్యామిలీ మీద నిజంగా ప్రేమే ఉంటే ఆ కుటుంబంలోని వారిలో ఒక్కరికి కూడా ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు. తన కొడుకు లోకేష్ కి మాత్రం మంత్రి పదవిని ఎలా కట్టపెట్టాడు. కూకట్ పల్లి అనేది ఓడిపోయే సీటు అని తెలిసికూడా సుహాసిని ని పోటీచేయించి, ఆమె ఓడిపోయాక మిగిలిన నందమూరి కుటుంబంలోని వారు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి రాకూడదనే ఎత్తుగడని చంద్రబాబు వేశారు. ఒకవేళ సుహాసిని గారి గెలుపుని కాంక్షించే వారైతే గెలుపు ఖాయం అని అనుకున్న ఏపీ లోని ఒక స్థానంలో సీటు ఇచ్చిఉండేవాళ్లు కదా” అని కేటీఆర్ చంద్రబాబు నాయుడు పన్నిన కుట్ర గా వర్ణించారు.ఇది మాత్రమే కాకుండా, “అమాయకుడిలా నేనేం తప్పుచేసానో చెప్పాలని చంద్రబాబు అడుగుతున్నారు. కేసీఆర్ తనని ఎందుకు విమర్శిస్తున్నారో కూడా అర్ధం కావడంలేదంటున్నారు. అది ఎందుకో నిజంగా చంద్రబాబు కి తెలియదా? పొత్తులను పెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది ఎవరు? బ్రీఫ్డ్‌ మీ అని ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయింది చాలదా?” అంటూ కేటీఆర్ విమర్శించారు. మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు లు పొలిటికల్ టూరిస్టులని, తెలంగాణలోకి టూరిస్టుల్లా వచ్చి, నాలుగు మాయమాటలు చెప్పి, తిరిగి వాళ్ళ వాళ్ళ ప్లేసులకు వెళ్ళిపోతారని, కేసీఆర్ ఇక్కడే ప్రజలకోసం పాటుపడుతూ ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు.

Harikrishna Daughter Nandamuri Suhasini To File Nomination From Kukatpally