టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన సిద్ధార్థ్ “చిన్నా” మూవీ ..!

Siddharth's movie "Chinna" is ready for TV premiere..!
Siddharth's movie "Chinna" is ready for TV premiere..!

టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ నటించిన తమిళ మూవీ చిత్తాతో తమిళ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో చిన్నా పేరిట రిలీజై విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిపోయింది.

Siddharth's movie "Chinna" is ready for TV premiere..!
Siddharth’s movie “Chinna” is ready for TV premiere..!

ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకుంది. కాగా, ఈ మూవీ ఈ ఆదివారం రోజున మధ్యాహ్నం 1:00 గంటలకి ప్రసారం కానుంది. సహస్ర శ్రీ, నిమిషా విజయన్, అంజలి నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ధిబు నినాన్ థామస్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు. బుల్లితెర పై ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.