ఉపాధి హామీ అమలులో ఉత్తమ జిల్లాగా సిద్దిపేట

Siddipeta is the best district in terms of employment guarantee

జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు అవార్డులు సాధించిన సిద్దిపేట జిల్లాకు మరో కీలక గుర్తింపు లభించింది. ఉపాధి హామీ పథకం అమలులో సిద్దిపేట జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా ఎంపికైంది. ఈ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడం, డబ్బు చెల్లింపు, పనిదినాల కల్పన, హరితహారం, సగటున కుటుంబాలకు కల్పించిన పనిదినాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలు ఎంపికయ్యాయి. ఉపా ధి హామీలో భాగంగా కూలీలకు పనిదినాలు కల్పించడంలో సిద్దిపేట జిల్లా ఎంపిక కావడంతో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కార్యక్రమం అమలుపై డాక్యుమెంటరీ అందజేయనున్నారు.