రోజుకు ఒక గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అని మనం టీవీ యాడ్స్‌లో వింటుంటాం. గుడ్డు పోషకాల పవర్ హౌస్. ఇందులో మాంసకృత్తులు , అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు సూచిస్తారు.రోజుకు రెండు గుడ్లు మాత్రమే తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య మెరుగుపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుడ్లలో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి., కాబట్టి దీనిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. చాలా మంది టిఫిన్, భోజనం, వ్యాయామం తర్వాత గుడ్డు తినడానికి ఇష్టపడతారు. కానీ గుడ్లు ఎక్కువగా తింటే శరీరానికి జరిగే మేలు పక్కన పెడితే..దుష్ర్పభావాలు కూడా అలానే ఉంటాయని వైద్యులు అంటున్నారు. గుడ్లు మితిమీరి తింటే.. అనారోగ్య సమస్యలు పెరుగుతాయని అంటున్నారు.
మన శరీరానికి రోజుకు 300 మి.గ్రా కొలెస్ట్రాల్ అవసరం. ఒక గుడ్డుల 186 మి.గ్రా కొలెస్ట్రాల్ అందిస్తుంది. ఇది కావాల్సిన దానిలో సగం కంటే ఎక్కువ. గుడ్లు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అకాశం ఉంది. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుడ్డులోని తెల్లసొనలో ప్రొటిన్ మాత్రమే ఉంటుంది. పసుపు సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డు తిన్నా.. కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇప్పటికే గుండె జబ్బులు ఉంటే, మీరు గుడ్లు తినడం తగ్గించండి.
డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ సమస్య ఉన్నవారు గుడ్లు ఎక్కువగా తింటే చాలా ప్రమాదం. గుడ్లు ఎక్కువగా తింటే రక్తంలో చక్కర స్థాయిలు నిలకడగా ఉండవు. ప్యాంక్రియాస్.. చక్కెర, గ్లూకోజ్‌ను ఎనర్జీగా మార్చే సమయంలో.. ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ విడుదల చేస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. ఈ విధంగా జరిగితే టైప్ -2 డయాబెటిక్ పేషంట్స్‌కు చాలా ప్రమదాం.
డయాబెటిస్ ఉన్న వారు రోజుకు రెండూ లేదా మూడు గుడ్లు మాత్రమే తినాలి. ఈ విధంగా తింటే.. దుష్ప్రభావలు ఉండవు.కొంతమందికి గుడ్లు ఎక్కువగా తింటే.. కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. నిజానికి, గుడ్లు ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గుడ్డులోని తెల్లసొనలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి చాలా హానికరం. వాస్తవానికి మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ మొత్తంలో జీఎఫ్ఆర్ ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన జీఎఫ్ఆర్ని మరింత తగ్గిస్తుంది. దీని కారణంగా కిడ్నీ రోగులకు సమస్య మరింత పెరుగే అవకాశం ఉంటుంది. కిడ్నీ పేషంట్స్ వైద్యుల సూచన మేరకు గుడ్లు తిసూకుంటే మంచిది.