హెయిర్ నెరవడం ఓల్డ్ ఏజ్‌కు గుర్తని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు వయసుపైబడుతున్నా హెయిర్ నెరవడంలేదు. ఒక్క తెల్లవెంట్రుక కూడా కనిపించడంలేదు. ఇదేదో ప్రకృతిచేసిన మాయాజాలం అనుకుంటే పొరపాటే. కెమికల్స్ చేస్తున్న ఇంద్రజాలం. అవును, ప్రపంచమంతటా కోట్లాదిమంది వాడుతున్న హెయిర్ డైయిస్లోని రసాయనాలే జుత్తు రంగును చిటికలో మార్చేస్తున్నాయి. అయితే, కోట్లాది మంది వాడుతున్న కెమికల్ రసాయనాలతో తయారయ్యే హెయిర్ డైస్ వాడటం మంచిదేనా? శరీరానికి ఎలాంటి హానీ చేయవా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
హెయిర్ డైస్‌ను ఉత్పత్తి చేస్తోన్న వందలాది కంపెనీలు సలహాలు పాటించకుండా విచ్చలవిడిగా కెమికల్స్‌ను ఉపయోగిస్తూ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ హెయిర్ డైస్ ద్వారా ఏటా కోట్లాది బిజినెస్ జరుగుతుందంటే ఆశ్చర్యపోనవసరంలేదు. మరి ఇంతటి ప్రమాదకరమైన రసాయనంపై నిషేధం లేదా? ప్రపంచదేశాలు దీన్ని యథేచ్ఛగా ఎందుకు వాడనిస్తున్నాయి ? నిజమే, పిపిడీ అత్యంత ప్రమాదకరమైనదన్న సంగతి తెలుసు. అయినా దీనిపై ఎక్కడా నిషేదం లేదు. ఈ కెమికల్ని కలర్ ఫిల్మ్ డెవలప్ మెంట్లోనూ, రబ్బర్ ఆక్సిడేషన్ లోనూ వాడుతున్నారు. జట్టుకు రంగేసుకోవడం ఇప్పుడు ఓ సాధారణమైన చర్యగా మారిపోయింది.
సునాయాసంగా కేశాలకు రంగు పట్టించుకునే అవకాశం రావడంతో క్రేజ్ పెరిగిపోయింది. హెయిర్ రంగు ఏమాత్రం మారినా వెంటనే హెయిర్ డై వాడేస్తున్నారు.హెయిర్‌కి వాడే రంగుల్లో రకరకకాల రసాయనాలను వాడటం వల్ల అనేక చర్మసంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారని అధ్యయనం ద్వారా బయటపడింది.ఈ రసాయనాలు వల్ల హెయిర్ నిగనిగలాడినప్పటికీ అది తాత్కాలికమే. ఆ తరువాత ఉన్న హెయిర్ కాస్త ఊడిపోవడంతో పాటు చిట్లిపోయి, కురులు పొడిబారి బలహీనంగా తయారవుతాయి.
అంతేకాదు ఈ రంగులను తరచుగా అప్లై చేయడం వల్ల అస్తమా వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. అస్తమా ఉన్న వారు ఈ రసాయన రంగుల వాడకాన్ని మానేయడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో రంగు వేసుకోవాలంటే.. హెయిర్ కలర్‌ను తలకు వేసుకునే ముందు చేతిమీద అప్లై చేసుకుని కాసేపు వెయిట్ చేయాలి. ఆ కలర్ చర్మంపై ఎలాంటి చెడు ప్రభావం చూపకపోతే అప్పుడు వాడినా పెద్ద చెడు ఉండదు.
*ఈ కలర్ వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి. వీటిలో వాడే రసాయనాల వల్ల కళ్ల కలకలతో పాటు .. కంటి చూపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కాబట్టి హెయిర్‌కి రంగువేసే ముందు కేశ ఆరోగ్య నిపుణులను సంప్రదించి వారి సలహాని పాటించడం మంచిది.అయితే నిజానికి మనకి తెలియకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలలో ఏదో గొప్ప విషయం దాగి ఉంది వాటిని మనం ఖచ్చితంగా పట్టించుకుని తీరాలి. అయితే ఇప్పుడు మనం ఎటువంటి పద్ధతులను పాటిస్తే హెయిర్ బాగుంటుంది..?, ఎలాంటి వాటిని అనుసరిస్తే మంచిది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ హెయిర్ మాస్క్‌ని ప్రయత్నిస్తే కచ్చితంగా మీ హెయిర్ ఒత్తుగా ఎదుగుతుంది. అదే విధంగా పొడవుగా కూడా ఎదుగుతుంది. దీని కోసం మీరు పెద్ద కష్ట పడక్కర్లేదు. కొద్దిగా మందార పొడి తీసుకుని అందులో ఉసిరి పొడి మరియు పెరుగు వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మీ హెయిర్ అంతా కూడా ఈ పేస్ట్‌ని పట్టించాలి.
ఒక అర గంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత షాంపూ స్నానం చేస్తే సరిపోతుంది. అయితే మీకు దీని వల్ల ఎందుకు ప్రయోజనం కలుగుతుంది అనేది చూస్తే… మందార పొడిలో ఎమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది హెయిర్ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అదే విధంగా ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది సర్క్యులేషన్‌కి సహాయ పడుతుంది అలానే జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది.
ఎక్కువగా దీని గురించి అమ్మలు చెబుతారు. ఈ పద్ధతి చాలా బాగుంటుంది. సిల్కీ హెయిర్ మరియు స్ట్రాంగ్ హెయిర్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ హెయిర్ ప్యాక్ ఇది. పైగా ఎంతో సులువుగా ఎవరైనా ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. దీని కోసం మీరు రాత్రి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులుని ఐదు టేబుల్ స్పూన్ల పెరుగులో వేసి నానబెట్టండి. గుర్తుంచుకోండి రాత్రంతా ఇది నానాలి. అప్పుడు ఉదయం లేచిన తర్వాత మీరు ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలకు బాగా అప్లై చేయండి.
ఒక గంట పాటు మీ హెయిర్‌ని అలా వదిలేసి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. ఇక మీకు సిల్కీ హెయిర్ మరియు స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది. ఇక దీని వల్ల ఎలా ప్రయోజనాలు పొందుతారు అనేది చూస్తే… మెంతులలో ప్రొటీన్, ఐరన్, ఫ్లెవనాయిడ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది హెయిర్‌ని దృఢంగా చేస్తుంది. అదే పెరుగు అయితే హెయిర్‌ని షైనీగా, సిల్కీగా చేస్తుంది. కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ కూడా మీకు బాగా ఉపయోగ పడుతుంది.