అక్టోబర్ 3న అంగరంగ వైభవంగా ప్రారంభమైన హిందీ బిగ్‌బాస్ 14 సీజన్ గడిచిన సీజన్ల కంటే భిన్నమైనది. కండల వీరుడుసల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న ఈ సీజన్లో స్వల్ప మార్పులు చేశారు. కలర్స్ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ 14లో గత సీజన్లలో పాల్గొన్న, గెలిచిన ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చారు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా, బిగ్ బాస్ 7 గౌహర్ ఖాన్, హీనా ఖాన్ బిగ్ బాస్ 11 రన్నరప్ వారు ఈ సీజన్లో అడుగు పెట్టారు. వీరంతా ఇప్పటికే బిగ్‌బాస్‌లో పాపులర్ అయిన వారు కాట్టి హౌజ్‌లో ఎక్కువ రోజులు కొనసాగడానికి వీరికి అవకాశం ఉంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.
బుధవారం జరగిన ఎపిసోడ్లో సింగర్ రాహుల్ వైద్య, పవిత్ర పునియా మధ్య దూరం మరింత పెరిగింది. కొత్తగా విడుదల చేసిన ప్రోమోలో ఆహార విషయంలో ఇద్దరు తీవ్ర వాదనకు దిగినట్లు కనిపిస్తోంది. రాహుల్ పవిత్రతో మాట్లాడుతూ తను ఇష్టపడే అమ్మాయి కోసం వంట చేయడం కంటే మధురమైనది మరొకటి లేదని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే తను పవిత్రను వంట చేయడం నేర్పించాలని కోరినట్లు తెలిపాడు. పవిత్ర ఆహారం సరిగా వండటం లేదని ఆమెపై ఆరోపణలు చేశాడు. దీనిపై కోపానికి వచ్చిన పవిత్ర నీ ఫుడ్ నువ్వే వండుకోవాలని అతనిపై అరిచింది. చదవండి: నేను నోరు విప్పితే.. ఆమెకే నష్టం’
మరోవైపు నామినేషన్లో వచ్చిన ఇంట్లోని మహిళా కంటెస్టెంట్లు రెయిన్ డ్యాన్స్ చేస్తూ సిద్ధార్థ్ శుక్లాను మెప్పించాల్సి ఉంటుంది. నిక్కి తంబోలి,సిధార్థ్ శుక్లా చేసిన రెయిన్ డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ముగ్గురు అమ్మాయిలు సిద్దార్థ్ చుట్టూ డ్యాన్స్ చేస్తుండగా, మిగతావారు పక్కనుంచి వారిని ఉత్సాహపరిచారు. ఎవరైతే సిద్ధార్థ్‌ను తమ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటారో వారు నామినేషన్నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా సిద్ధార్థ్ నిక్కి భుజంపై పచ్చబొట్టు వేయడం కూడా జరుగుతోంది. ఇక ప్రోమెలు, ఎపిసోడ్లతో బిగ్‌బాస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుండటంతోపాటు ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ బోలేడు గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి.