ముఖ్యంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హార్ట్ ఎటాక్‌తో సతమతమవుతున్నారు. ఏది ఏమైనా గుండెపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆరోగ్యం పై శ్రద్ధ పెడితే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు రావు. అయితే ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
నిజానికి వీటి యొక్క లక్షణాలను మనం గమనించి సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం ఉండదు. లేదంటే గుండె పోటుతో మరణించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయితే గుండె పోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కలుగుతాయి. ఎలా గుండె పోటు సమస్యను మనం గుర్తించవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.
ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి. చాలామంది ఇది ఎసిడిటీ ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి గుండె పోటు వచ్చే ముందు కూడా ఛాతిలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా సరే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా గుండె పోటు వచ్చే ముందు శరీరంలో తీవ్రమైన అలసట కలుగుతుంది. ఇది కూడా గుండెపోటు లక్షణమే.
అంతే కాదు దవడ, మెడ, డైజెస్టివ్ సిస్టంలో నొప్పి కలగడం లాంటి లక్షణాలు కూడా గుండె పోటు యొక్క లక్షణాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ ఎడమ చేయి వైపు కానీ రెండు చేతుల్లో కానీ నొప్పి వస్తే అది కూడా గుండెపోటు లక్షణమే. ఛాతిలో కూడా ఆందోళనకరంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు వస్తే హార్ట్ ఎటాక్ అని మనం గుర్తించ వచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమైనా కలిగాయి అంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేసి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం.
గుండెపోటు అనేది గుండె యొక్క మజిల్స్‌కి రక్తం వెళ్లకుండా స్టాప్ చేస్తుంది. అదే గుండెపోటు అంటే. అయితే గుండె పోటు అనేది ఎంతో ప్రమాదకరం. పైగా వీళ్ళలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అనారోగ్య సమస్యలు ఉండే వారిలో ఎక్కువగా గుండె పోటు వచ్చే అవకాశం ఉందని.. అలాంటి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది అయితే మరి ఎలాంటి సమస్యలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సమస్యలతో బాధపడే వారికి గుండె పోటు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు వాటి కోసం ఒక లుక్ వేసేద్దాం.
హైబీపీ లేదా హైపర్టెన్షన్ ఉండడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎప్పుడు వస్తుంది అంటే బ్లడ్ యొక్క ప్రెషర్ ఆర్టెరీస్ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు కలుగుతుంది. దీంతో గుండె చాలా ఎక్కువ కష్ట పడాల్సి వస్తుంది. రక్తం పంపిణీ చేయడం నిజంగా కష్టమవుతుంది దీనితో హార్ట్ఎటాక్ వస్తుంది.
బ్లడ్‌లో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజించచ్చు. ఒకటి రెండవది కొలెస్ట్రాల్. ఎల్డీఎల్ అనేది చెడు కొలెస్ట్రాల్. దీని కారణంగా కూడా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. కనుక చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లల్లో ఎక్కువగా గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైగా ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. డయాబెటిస్ లేదా హై బీపీ షుగర్ లెవెల్స్ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతూ ఉండాలి. వీరిలో కూడా ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
డిప్రెషన్ సమస్యతో ఉన్న వాళ్లు కూడా హార్ట్ ఎటాక్‌తో బాధ పడే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. డిప్రెషన్ కారణంగా గుండె జబ్బులు వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ సమస్య ఉన్న వాళ్లు కూడా జాగ్రత్త పడాలి. వారిలో కూడా ఈ సమస్యలు కలుగుతూ ఉంటాయి.
చాలా మంది చెడు అలవాట్లకు బాగా అలవాటు పడిపోయారు. స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలానే అనారోగ్యం కలిగించే ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల కూడా గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వారిలో కూడా గుండె సమస్యలు వస్తాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.పోషకాహారం తీసుకోవడం సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల గుండె సమస్యలు రావు లేదు అంటే హార్ట్ ఎటాక్ సమస్య కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇవన్నీ కూడా హార్ట్ ఎటాక్ యొక్క లక్షణాలు కాబట్టి ఇటువంటి లక్షణాలు కనుక వచ్చాయి అంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రమాదం ఉండదు. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ ని అస్సలు లైట్ తీసుకో వద్దు. నిజంగా లైట్ తీసుకుంటే రిస్క్ మీకే.
నిజానికి ఈ మధ్య కాలం లో చాలా మంది ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేయడానికి ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. అయితే ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఊబకాయంతో బాధ పడే వాళ్ళూ కూడా జాగ్రత్తపడాలి. బరువు తగ్గడం, కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం, వ్యాయామం చెయ్యడం, లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం లాంటి వాటిని అనుసరిస్తూ ఉండాలి.
లేదంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.ఒకవేళ కనుక మీ ఫ్యామిలీ హిస్టరీలో కార్డియో వాస్క్యులర్ సమస్యలు కలిగి ఉంటే… మీకు కూడా ఆ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫామిలీ హిస్టరీలో ఈ సమస్యలు ఉన్నట్లయితే తప్పని సరిగా జాగ్రత్త పడటం ముఖ్యము. ఎందుకంటే వాళ్ల వల్ల మీకు కూడా ఈ సమస్య కలిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడటం అవసరం.