సిల్లీ ఫెల్లోస్ ట్రైలర్

Silly Fellows Official Trailer

అల్లరి నరేష్, సునీల్ ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేక రేసులో వెనకబడిపోయారు. వీరిద్దరూ ఒకరు ఎన్ టీఆర్-త్రివిక్రమ్ కాబినేషన్ లోనటిస్తుండగా మరొకరు మహేష్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని కామెడీ సినిమాల ఎక్స్పర్ట్ భీమినేనితో కలిసి ఒక సినిమా చేశారు, అదే ‘సిల్లీ ఫెలోస్’. చాలా కాలం తరవాత నటిస్తున్న ఈ ఇద్దరూ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇచ్చేందుకు సిద్ధమైపోయారు.

Silly-Fellows

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం విడుదల చేశారు. నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్. మీరు కూడా చూసెయ్యండి మరి.