ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్‌గా కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్ ఇండియన్ ఐడల్-9 టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. బాహుబలి పార్ట్-1లో మనోహరి పాటతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రేవంత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. డిసెంబర్24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రేవంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రేవంత్‌కి కాబోయే భార్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.