సింగర్ శ్రావణి భార్గవి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు . ఈమె తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. తన అద్భుతమైన వాయిస్ కి కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అవుతారు. శ్రావణ భార్గవి సింగర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతల ను సంపాదించుకున్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతల ను సంపాదించుకున్నారు. ఇక ఈమె సింగర్ హేమచంద్ర ని ప్రేమించి వివాహం చేసుకున్నది . వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది.
అయితే వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరి నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయితే కొన్ని రోజులకి ఆ వార్తలు పూర్తిగా అవాస్తమంటూ వారిద్దరూ చెప్పకనే చెప్పేసారంట . కొన్ని రోజుల నుంచి వారిద్దరూ ఎలాంటి ఈవెంట్ ఫంక్షన్లలో పాల్గొనకపోవడంతో దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో వారి ప్రేక్షకులకు ఎప్పుడు చేరువలోనే ఉంటారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం శ్రావణ భార్గవి రెండో పెళ్లికి సిద్ధమైందని….హల్దీ ఫంక్షన్ కూడా చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి .
కానీ ఆ హల్ది ఫంక్షన్ తనది కాదని… తన సోదరుడి వివాహంలో హల్ది ఫంక్షన్ లో పాల్గొన్నదని ఆమె తెలిపింది . అవి కూడా ఇప్పటిది కాదు. ఒక సంవత్సరం క్రితం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు శ్రావణ భార్గవి రెండో వివాహానికి సిద్ధమైందని అనుకున్నారు. ఇక శ్రావణి భార్గవి ఈ వార్తలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటుంది . ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే శ్రావణి భార్గవి భారీగానే ఆస్తులను కూడా సంపాదించుకున్నది . శ్రావణ భార్గవి ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది.