హాలీవుడ్లో నిర్మితమయ్యే భారీ చిత్రాలను తెలుగులో చూడాలంటే ఇబ్బందిగా అనిపించేది.కాని ఇప్పుడు డబ్బింగ్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.‘ది లయన్ కింగ్’లో నాని, రానా, బ్రహ్మానందం, ఆలీ వంటి స్టార్లతో డబ్బింగ్ చెప్పించారు. ఆయా పాత్రలకు వాళ్లు ఇచ్చిన వాయిస్ చాలా బాగా కుదిరింది. అలాగే, ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియో నిర్మించిన ‘ఫ్రోజెన్ 2’ సినిమా విషయంలోనూ డబ్బింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
యంగర్ ఎల్సా పాత్రకు సితార డబ్బింగ్ చెప్పడంపై ఆమె తల్లి నమ్రతా శిరోద్కర్ స్పందించారు. ‘‘సితార ‘ఫ్రోజెన్’ను చూస్తూ పెరిగింది. అప్పటి నుంచి ఎల్సా పాత్ర అంటే ఆమెకు ఎంతో ఇష్టం. యంగ్ ఎల్సాకు తన గాత్రాన్ని ఇవ్వడంతో సినిమాపై ఆమెకున్న ఇష్టం మరింత పెరిగిపోయింది. ఇది ప్రతి అమ్మాయికి సంబంధించిన సినిమా. సితార దానికి భిన్నమేమీకాదు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని సితారకు ఇచ్చినందుకు డిస్నీకి థ్యాంక్స్. ఈ సినిమా తెలుగు వర్షన్లో తాను భాగమైనందుకు సితార ఎంతో హ్యాపీగా ఉంది. తనకెంతో ఇష్టమైన పాత్రకు వాయిస్ ఇవ్వడాన్ని ఎంతో ఎంజాయ్ చేసింది’’ అని నమ్రతా చెప్పారు.