రాబోతున్న రోజుల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని సినీ ప్రముఖులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ మాదిరిగానే ఆన్‌లైన్‌లో ఏదైనా వెబ్ పోర్టల్ ద్వారా ప్రసారం అయిదే దాన్ని వెబ్ సిరీస్ అంటారు. తెలుగులో నిహారిక తెరకెక్కించిన ఆవకాయ్ బిర్యాణితో తెలుగు ప్రేక్షకులకు వెబ్ సిరీస్ గురించి ఒక అవగాహణ వచ్చింది. అప్పటి నుండి వరుసగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే వెబ్ సిరీస్‌లు అనేవి ఇప్పటి వరకు మినిమం బడ్జెట్‌తోనే తెరకెక్కుతూ వచ్చాయి. తెలుగు వెబ్ సిరీస్‌లు లక్షల్లో బడ్జెట్‌తో మాత్రమే తెరకెక్కాయి. అయితే త్వరలో రాబోతున్న బాహుబలి ప్రీక్వెల్ వెబ్ సిరీస్ ‘శివగామి’ మాత్రం ఏకంగా 375 కోట్లతో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.
బాహుబలి నిర్మాతు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనిలు ఈ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు పది బాషల్లో ఈ వెబ్ సిరీస్‌ను డబ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వెబ్ సిరీస్‌కు ఇంత బడ్జెట్ పెట్టడం ఎంటీ, అంత బడ్జెట్ రికవరీ ఎలా అంటూ సినీ వర్గాల వారు అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక వేళ సినిమాను వెబ్‌లో చూడాలి అంటే కొంత మొత్తంలో ఛార్జ్ చెల్లించాలని నిర్మాతలు రూల్ పెడతారేమో. అలా పెట్టినా కూడా దాదాపు 375 కోట్లను రికవరీ ఎలా చేస్తారు అనేది ప్రస్తుతం అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఈ మొత్తం బడ్జెట్‌ను రికవరీ చేసేందుకు నిర్మాతల వద్ద మాస్టర్ ప్లాన్ ఉండి ఉంటుందని, అందుకే ఇంత ధైర్యంగా వెబ్ సిరీస్‌కు అంత బడ్జెట్ పెడుతున్నారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లబోతున్న శివగామి వెబ్ సిరీస్ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఎన్ని పార్ట్‌లుగా రాబోతుందనే విషయంలో ఇంకా ఆర్కా మీడియా క్లారిటీ ఇవ్వలేదు. రాజమౌళి పర్యవేక్షణలో దాదాపు ముగ్గురు నలుగురు దర్శకులు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు.