బాబు కి శివసేన ఇచ్చిన మాట ఏంటో తెలుసా ?

Sivasena Party Secret Promise to Chandra Babu
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహస్యంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తో సంప్రదింపులు జరిపినట్టు జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలతో సంచలనం రేగింది. ఈ చర్చలు జరపడం ద్వారా ప్రధాని మోడీ వ్యతిరేకులతో చంద్రబాబు చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకుముందే ఈ కోణంలో శివసేన సైతం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ప్రాధమిక స్థాయి చర్చలు జరిపింది. అయితే మమతా , ఉద్ధవ్ దూకుడు చూసి మిగిలిన ప్రాంతీయ పార్టీల వారికి మద్దతు తటపటాయించాయి. ఎప్పుడైతే చంద్రబాబు నుంచి బీజేపీ , కాంగ్రెస్ యేతర కూటమి అన్న ప్రతిపాదన వచ్చిందో మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బీజేడీ, సమాజ్ వాదీ లాంటి పార్టీలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన శివసేన కొత్త కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు పేరు ప్రకటిస్తే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని భావిస్తోంది.అందుకే చంద్రబాబు ఫోన్ చేయగానే ఉద్ధవ్ సానుకూలంగా మాట్లాడారట. జాతీయ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తే బాగుంటుందని, ఉత్తర భారతంలో బాబు అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని బాబుకి శివసేన మాట ఇచ్చిందట. బీజేపీ చెప్పే కల్లిబొల్లి కబుర్లకు లొంగిపోతే మాత్రం మున్ముందు దారుణమైన పరిణామాలు చూడాల్సివస్తుందని హెచ్చరించారట. దీనికి బదులు ఇచ్చిన చంద్రబాబు ఒక్కసారి పోరాట బాట ఎంచుకున్నాక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారట.