మరి గర్భిణీలు వారి ఆరోగ్య పరిస్థితుల వల్ల మరియు సమయం లేకపోవడం వల్ల కొంత వరకూ స్కిన్ కేర్‌ను నెగ్లెక్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా స్కిన్ కేర్ని పాటించడం ఎంతో అవసరం అని తెలుసుకోవాలి.ప్రెగ్నెన్సీ అనేది ఎంతో అందమైన ప్రయాణం మరియు ఒక స్త్రీ యొక్క జీవితంలో గుర్తుండిపోయే రోజులు ఉంటాయి.
తొమ్మిది నెలల ప్రయాణంలో శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. కాబట్టి డైట్ మరియు ఫిట్‌నెస్‌కు సంబంధించి చర్యలు తీసుకోవడంతో పాటు చర్మ సౌందర్యం గురించి కూడా ఆలోచించుకోవాలి. ప్రెగ్నెన్సీ వలన శరీరంలో హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుతాయి. ముఖ్యంగా మెలనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్ల చర్మంపై యాక్ని, పొడిబారిపోవడం, డార్క్ స్పాట్స్ మరియు హైపర్ పిగ్మెంటేషన్ వంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు.
చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి కొన్ని రకాల హానికరమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్యాలిసైక్లిక్, రెటినాల్ మరియు హైడ్రోక్వినోనే. ఇటువంటి కెమికల్స్ ఉన్న వాటిని ప్రెగ్నెన్సీ సమయంలో అసలు ఉపయోగించకూడదు. ఇటువంటి పదార్థాలతో తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటికి బదులుగా సహజమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడంలో ఎటువంటి తప్పులేదు.
కొన్ని రకాల ఉత్పత్తులలో విటమిన్ సిను ఉపయోగించి తయారుచేస్తారు. అయితే విటమిన్ సిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాని వల్ల చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది మరియు డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ వంటి వాటిని తగ్గిస్తుంది. అయితే విటమిన్ సిను ఉపయోగించి తయారుచేసిన ఉత్పత్తులను వాడే ముందు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి గైడెన్స్ తీసుకోండి.
చాలావరకూ సన్‌స్క్రీన్స్ కెమికల్ బేస్డ్ ఉంటాయి. వాటి వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో మరి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీటికి బదులుగా మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్‌ను ఉపయోగించండి. దాంతో మీ చర్మంను యువి వంటి హానికరమైన కిరణాల నుండి రక్షించుకోవచ్చు.
చాలా వరకు ఎటువంటి ఉత్పత్తులైన కొనుగోలు చేసేటప్పుడు దానిని తయారు చేసేందుకు ఏ పదార్థాలను ఉపయోగించారో చూస్తూ ఉంటాము. అయితే యాసిడ్స్ వంటి వాటిని చూసినప్పుడు అది మంచి ఉత్పత్తి కాదని భావిస్తాము. కాకపోతే అజీలైక్ యాసిడ్ అనే యాసిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఎంతో సురక్షితమైనది. ఈ అజీలైక్ యాసిడ్ బేస్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల యాక్ని మరియు హైపర్ పిగ్మెంటేషన్ పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో పాటుగా చర్మం ఎంతో కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.
ఒకవేళ మీ చర్మం ఎంతో పొడిబారిపోయినట్లు మరియు టైట్‌గా కనబడుతుంటే క్రమంగా మీ చర్మంను మాయిశ్చరైజ్ చేయండి. దాని వల్ల చర్మంకు కావల్సినంత తేమ అందుతుంది. కాబట్టి చర్మం పొడిబారి పోకుండా ఉండడానికి మాయిశ్చరైజర్‌ను తప్పకుండా ఉపయోగించండి.మీరు ఎదుర్కొనే సమస్యలు బాగా సీరియస్ కాకపోతే సహజంగా నయం చేసుకోవడానికి ప్రయత్నించండి కెమికల్స్ కలిగిన మరియు హానికరమైన ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరింత తీవ్రంగా చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంటే కచ్చితంగా డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్ళండి మరియు వారి సూచనల మేరకు మీ డైలీ స్కిన్ కేర్ రోటీన్‌ను మార్చుకోండి.
స్కిన్ కేర్‌లో భాగంగా ఉత్పత్తులను వాడటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. చర్మ ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో అవసరం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు దానిమ్మ, బొప్పాయి, విటమిన్ సి కలిగి ఉన్న పండ్లు వంటి వాటిని తీసుకోండి.
స్కిన్ కేర్‌లో భాగంగా మంచి నీరు తాగడం ఎంతో అవసరం. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల వరకు మంచి నీరు తాగాలి. దాని వల్ల శరీరంలో ఉండే చెడు ట్యాక్సిన్స్ తొలగిపోతాయి. ఈ విధంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు కెరొటినాయిడ్స్ కూడా శరీరానికి అవసరమే. కాబట్టి ఈ పోషక విలువను అందడానికి స్వీట్ పొటాటో, క్యారెట్స్ మరియు ఆప్రికాట్స్‌ను క్రమంగా రోజువారీ ఆహారంలో జోడించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు మరియు ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండగలుగుతారు. అదే విధంగా ఏ నష్టాలూ లేకుండా హాయిగా ఉండొచ్చు.