నిద్ర ఎంత ముఖ్యమో పార్టనర్ తో అదీ అంతే ముఖ్యం !

Sleep And Romance Has Equal Priority Says Doctors

ఆఫీసులో పనిచేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లే ఉద్యోగులు తమ జీవిత భాగస్వామితో ఏకాంతంగా ప్రకృతి చర్యలో పాల్గొనడం కంటే నిద్రపోవడానికే ఆసక్తి చూపిస్తున్నారట. అందుకు కారణాలు ఎన్ని ఉన్నా తమ భర్త/భార్య కోసం అప్పటివరకూ ఎదురుచూసిన వాళ్లు మాత్రం బాధపడుతున్నారని 80 శాతం ఉద్యోగులు సెక్స్, నిద్ర ఆప్షన్లు ఇస్తే నిద్రకే మొగ్గుచూపుతున్నారని ఒక సర్వేలో తేలింది. రాత్రివేళ ఆలస్యంగా ఇంటికి వెళ్లి తమ భాగస్వామికి విషయం చెప్పి ప్రశాంతంగా నిద్రపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. పెళ్లికాని ఉద్యోగస్తులకు ఈ సమస్య లేదు. కానీ వివాహితులైన ఉద్యోగస్తుల పరిస్థితి అలా కాదట, బాగా అలసిపోయి రాత్రి ఇంటికి వచ్చిన ఉద్యోగులు నిద్రపోవాలనుకుంటారు. కంటినిండా నిద్ర లేకపోతే మరుసటి రోజు పనుల్లో ఏకాగ్రత ఉండదని, బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయని భావిస్తారట.

కానీ తన భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం వలన నిద్రకు మించిన ప్రయోజనాలున్నాయన్న వాదన వైద్యులు వినిపిస్తున్నారు. సెక్స్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలై బాగా నిద్రపడుతుంది. స్లీప్ థెరపీలో భాగంగా సెక్స్‌ చేయడం ముఖ్యమని చెబుతారు. సెక్స్ చేస్తే గంటకు 300 కేలరీలు ఖర్చవుతాయి. అరగంట వాకింగ్ చేస్తే అంతే మొత్తంలో శక్తి ఖర్చవుతుంది. సెక్స్ చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోయి కొత్త రక్తం సరఫరా అవుతుంది. మంచి, చెడు కోలెస్ట్రాల్ మధ్య సమతౌల్యం వస్తుంది. సో నిద్ర ఎంత ముఖ్యమో మీ పార్టనర్ తో ప్రకృతి చర్య కూడా అంతే ముఖ్యం.