వరదలతో అతలాకుతలం అయిన కేరళ కు వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటే వాళ్ళ వెతలపై కూడా వెకిలి ని మాటలతో , చూపులతో ,చేతలతో ప్రదర్శించే వారిని అనడానికి మాటలు కూడా సరిపోవు .. . కేరళ పరజలు తిరిగి సామాన్య జీవనం కొనసాగించడానికి తమకు చేతనైన సహాయం గా కొందరు బట్టలు, సబ్బులు, ఆహార పదార్థాలు వాటితో బాటు మహిళలకు అవసరమైన సానిటరీ నాప్కిన్ లను కూడా పంపడాన్ని వెకిలిగా చేసిన ఒక పని తన ఉద్యోగం ఊడేలా చేసింది ..సోషల్ మీడియా ని తన ఇష్టానికి వాడి ఉద్యోగం, పరువు పోగొట్టుకుని తాను తీస్కున్న గోతి లో తానే పడ్డాడు .. సానిటరీ నాప్కిన్ ల తో పాటు కండోమ్స్ కూడా పంపించాలి అని తను పెట్టిన పోస్ట్ ఆఫీసు యాజమాన్యం దృష్టికి వెళ్లిన తక్షణమే తన సేవలు కంపనీ కి చాలు అంటూ … తనకు రావాల్సిన మొత్తం సెటిల్ చేసి పంపించింది ఒమాన్ దేశం లోని లులు కంపెనీ ..
కేవలం ఆఫీస్ లో వారి ప్రవర్తన పైన మాత్రమే కాదు , సోషల్ మీడియా లో కుడా వారి ప్రవర్తన పై దృష్టి పెడుతున్న కంపెనీ లు … చేతిలో మొబైల్ అందులో డేటా ఉంది కదా విషాన్ని చిమ్మాలనో , వెకిలి తనం ప్రదర్శించాలనో అనుకుంటే ఆ ఊభి లో వల్లే కూరుకు పోతారు అని మరొక్క సారి ఋజువు అయ్యింది …ఇలాంటి వ్యక్తుల వల్లే సోషల్ మీడియా లో విషం చిమ్మే వార్తలు , తప్పుడు సమాచారాలు వేగం గా చేరడం అది జనాల్ని మరింత సందిగ్ధం లో పడేయం … అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక దశ లో సోషల్ లో మీడియా ని రద్దు చేయాలి అని ఆలోచన లో కూడా ఉన్నట్లు సమాచారం ..