రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సుదీప్తి అనే మహిళ.. అదే ఆసుపత్రిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోవడం కలకలంరేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న సుదీప్తి ఈనెల 6వ తేదిన బండ్లగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.
ఈ క్రమంలో.. ఆరోగ్యం కుదుటపడటంతో నిన్ననే డిశ్చార్జ్ కావాల్సిన మహిళ తన రూమ్‌లో.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.