సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె ఉషను అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉష తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఉష సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేస్తామని చెప్పారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.