మెక్సికోలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంజలి దారుణ హత్యకు గురయ్యారు. కాలిఫోర్నియా శాన్‌జోస్‌లోని లింక్డ్ఇన్ కంపెనీలో పనిచేస్తున్న అంజలి పుట్టినరోజు వేడుకల కోసం మెక్సికోలోని తులుమ్‌కు వెళ్లింది.
ఈ క్రమంలో అంజలి బస చేసిన హోటల్లో రెండు డ్రగ్స్ గ్యాంగ్‌ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అంజలితో పాటు మరో జర్మన్ టూరిస్ట్ దుర్మరణం చెందారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంజలి సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌గా తెలుస్తోంది.