మద్యానికి బానిసైన కొడుకుని రోకలితో బాది చంపిన తండ్రి……

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. చెట్టంత ఎదిగిన కొడుకుని దారుణంగా తండ్రి కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది. మద్యానికి బానిసై భార్యాబిడ్డలను వదిలేసిన కొడుకు.. నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో చూశాడు.. చూశాడు.. కన్న కొడుకులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో అది భరించలేక కొట్టి చంపేశాడు.

అయితే జిల్లాలోని చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకి చెందిన ఏసోబు, రత్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్దకొడుకు నరేష్ కి పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన నరేష్ రోజూ భార్యా పిల్లలను వేధిస్తుండటంతో అది భరించలేక వేరుగా ఉంటుంది. అప్పటి నుంచి నరేష్ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. రోజూ ఫుల్లుగా మందు తాగొచ్చి తల్లిదండ్రులతో గొడవకి దిగుతున్నాడు. ఇలా సాగుతూ ఉంది. ఈ మధ్యం మత్తులో తల్లిని కొట్టడంతో ఆమె గ్రామంలోనే ఉన్న తన సోదరుడి ఇంటికెళ్లింది. నిత్యం వేధింపులు భరించలేకపోయిన ఏసోబు కొడుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో తలపై బలంగా మోదాడు. దీంతో తలకు తీవ్రగాయాలైన నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా వెంటనే విషాయన్ని తెలుసుకున్న చిలకలూరిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.